calender_icon.png 15 August, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లింల చరిత్రను విస్మరించిన పాలకులు

15-08-2025 01:12:43 AM

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

ముషీరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాం తి): దేశ స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింలు కూడా ప్రధాన పాత్ర పోషించారని, ప్రస్తుత కేంద్ర పాలకులు మాత్రం ఈ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అస దుద్దీన్ ఓవైసీ అన్నారు. నేతాజీకి ముఖ్య అనుచరుడు హబీద్ హాసన్ సత్రానీని పాలకులు గుర్తించ కపోవడం బాధాకరమన్నారు.  గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ ఇస్టారికల్ రీసర్చ్ ఆధ్వర్యంలో ‘ఆన్ వెఫ్ట్ అండ్ ఆన్ సంగ్ హీరోస్ ఆఫ్ తెలంగాణ‘ పై సదస్సు నిర్వహించారు.

సదస్సులో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ స్వాతంత్య్ర పో రాటానికి కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి ఎలాంటి సంబంధం లేదన్నారు. హైదరాబాద్ తెలంగాణకు చెంది న ఎంతోమంది ముస్లింలు ఆంగ్లేయులపై పోరాటం చేశారని, వారి పేర్లు చరిత్ర లో కనిపించడం లేద న్నారు.10 ఏళ్లు పోరాటం చేసిన ఒక సమరయోధుని ఫోటో ప్రధాని కార్యాలయంలో పెట్టారని, 30 ఏళ్ల పాటు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అండమాన్ జైలులో శిక్ష అనుభవించిన హై దరాబాద్‌కు చెంది న మాలియా అల్లాఉద్దీన్ ఫోటో ఎందుకు పెట్టలేదని  ప్రశ్నించారు.

గాంధీ, నేతాజీలతో ఎంతోమంది ముస్లింలు కలిసి నడిచారని, నేతాజీకి అన్ని విధాలుగా అండగా ఉండి ఇండియన్ నేషనల్ ఆర్మీ లో కీలక పాత్ర పో షించి జైహింద్ అన్న నినాదం ఇచ్చిన అబి ద్ హాసన్ సత్రాని హైదరాబాద్‌కు చెందిన వ్యక్తేనని గుర్తు చేశారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చెన్నారెడ్డి మాట్లాడు తూస్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న హైదరాబాదీల పేర్లు చరిత్రలో లేవన్నారు.   కెప్టెన్ ఎల్.పాండురంగారెడ్డి మాట్లాడుతూ జాతీ య జెండా రూపకల్పనను హైదరాబాద్‌కు చెందిన మహిళ చేసిందని ఇది చరిత్రలో లేదన్నారు. ఆలిండియా తామీర్ ఇ-మిలాద్ అధ్యక్షుడు జియాఉద్దీన్ నాయక్, వివేక్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.