calender_icon.png 15 August, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య శాఖలో ఉద్యోగాల పేరుతో రూ.1.40 కోట్ల మోసం

15-08-2025 01:14:55 AM

సిట్ చేత దర్యాప్తు చేసి న్యాయం చేయాలని బాధితుల విజ్ఞప్తి

ముషీరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాం తి): ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఆ తర్వాత ఆరు నెలలకే పర్మినెంట్ చేస్తారని తప్పుడు ఆర్డర్ కాపీలతో నమ్మించి రూ.1.40 కోట్లు కాజేసి మోసం చేసిన వారిపై చేత సిట్ ద్వారా సమగ్ర దర్యా ప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని మంచిర్యాల జి ల్లా మందమర్రికి చెందిన బాధితులు కె.నాగరాజు, ఎన్.విజయ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియాతో మాట్లాడా రు.

కరీంనగర్ కు చెందిన బిజ్జిగిరి శ్రీనివాస్, అతని స్నేహితుడు అబ్బోజు శ్రీనివాస్, అత ని చెల్లలు బొజ్జిగిరి శ్యామల ఆరోగ్య శాఖలో (సీనియర్ అసిస్టెంట్)లు కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగాలిప్పిస్తామని తమను నమ్మించి మోసం చేశారాని తెలిపారు. ఉద్యోగ శిక్షణ తో పాటు తమను ప్రత్యేకంగా సచివాల యం తీసుకెళ్లి ఓ ఆఫీసర్ దగ్గర ఇంటర్వ్యూ కూడా చేయించారని నాగరాజు తెలిపారు. అప్పటిదాకా తమకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతోనే ఉన్నామన్నారు. కానీ, చివరికి ఉ ద్యోగ ఆర్డర్ కాపీ నకిలీదని తేలిందన్నారు.

తాము మోసపోయామని గ్రహించి 2024 జూలై 5న రాంగోపాల్‌పేట పీఎస్‌లో ఫిర్యా దు చేశామని, కానీ, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. తమను మోసం చేసిన వారిపై వివిధ పీఎస్‌లలో కేసులు కూడా ఉన్నాయని తెలిసిందన్నారు. తమ ఫిర్యాదుపై  గట్టిగా అడిగితే తమ మీద నే కేసు నమోదు చేస్తామని బెదిరించారని వాపోయారు. అయినప్పటికీ తాము ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నిలదీయగా బుక్ చేశారని, కానీ వాళ్లలో ఒక్కరినీ కూడా పీఎస్ కు తీసుకురాలేదన్నారు.

తాము పీఎస్ లో ఉండగానే వారితో పోలీసులు ఫోన్లో మాట్లాడారని తెలిపారు. ప్రశ్నిస్తే తమకు దొ రకడం లేదని దాటవేసే సమాధానాలు చె బుతూ ఐదు నెలలు సాగదీశారన్నారు. ఈ లోపల వారు బెయిల్ తెచ్చుకుని, ఏమైనా ఉంటే కోర్టులోనే మాట్లాడుకొమ్మని చెప్తుతున్నారని వాపోయారు. ఏ2గా ఉన్న శ్రీనివాస్‌ను ఇంతవరకు అరెస్ట్ చేయలేదని చెప్పారు.