calender_icon.png 1 May, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్గుట్టలో ‘రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్’

01-05-2025 12:54:54 AM

చేవెళ్ల , ఏప్రిల్ 30 : చేవెళ్ల మండల పరిధి పల్గుట్ట గ్రామంలో కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్  యూనివర్సిటీ మోజర్ల విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం ‘రూరల్ హార్టికల్చర్  వర్క్ ఎక్స్‌పీరియన్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు అనుసరిస్తున్న వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంటున్నట్లు తెలిపారు.

గ్రామ పటం, నేల రకం, వ్యవసాయంలో సాంకేతికత, నిల్వ, దిగుబడిని పెంచడం, పూల మొక్క లు చామంతి, లిల్లి, బంతి పంటలపై రైతులకు అంగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సానియా, యు.అఖిల, సంతోష, లావణ్య, ప్రీతి, శారద, స్వాతి, రైతులు పాల్గొన్నారు.