calender_icon.png 1 May, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

01-05-2025 12:57:03 AM

మేడ్చల్, ఏప్రిల్ 30(విజయ క్రాంతి): గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక విద్యార్థిని అక్కడికక్కడ మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కామారెడ్డి జిల్లా నల్లమడుగు కు చెందిన ధనావత్ అర్చన(17), సోదరుడు ధారావత్ హరి విందు (19) తో కలిసి హైదరాబాదుకు పరీక్ష రాయడానికి వచ్చి బుధవారం తెల్లవారుజామున స్వగ్రామానికి వెళుతుండగా మేడ్చల్ పట్టణంలోని చెక్ పోస్ట్ సమీపంలో భారత్ పెట్రోల్ బంక్ వద్ద ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది.

దీంతో అర్చన అక్కడికక్కడే మృతి చెందింది. గుర్తుతెలియని వాహనం డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.