calender_icon.png 25 October, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ అవగాహన కార్యక్రమం

24-10-2025 12:00:00 AM

ఏటూరునాగారం, అక్టోబరు23(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐక్యుఏసి మరియు ఈడిసి విభాగాల ఆధ్వర్యంలో ’గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ అవగాహన కార్యక్రమంను నిర్వహించారు.

ఈ కార్యక్రమంను భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వారి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి రేణుక అధ్యక్షత వహించి కార్యక్రమమును ప్రారంభించి మాట్లాడుతూ ఉత్సాహంగా ఉన్న విద్యార్థిని విద్యార్థులు అందరూ సంస్థ చేపడుతున్న వివిధ శిక్షణ కోసమై దరఖాస్తులు చేసుకొని శిక్షణ పొంది స్వయం ఉపాధి వైపు నడవాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

అనంతరం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కోసం వచ్చిన ముఖ్యఅతిథి తవుడు నాయుడు మాట్లాడుతూ విద్యార్థులకు వివిధ స్వయం ఉపాధి విషయాల కల్పించారు. అనంతరం ఏటూరునాగారం స్వయం ఉపాధి శిక్షణ సంస్థ బాధ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ స్థానిక ఏటూరునాగారంలో వివిధ స్వయం ఉపాధి కోర్సులపై ట్రైనింగ్ నిర్వహించబడుతుందని ఆసక్తిగా ఉన్న విద్యార్థులందరూ పేర్లను నమోదు చేసుకొని ఉచిత శిక్షణ పొందగలరని పేర్కొన్నారు.

తర్వాత భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ హసన్పర్తి బాధ్యులు కుమార్ మాట్లాడుతూ వివిధ శిక్షణ కార్యక్రమంలో గూర్చి వివరిస్తూ, బ్యాంకింగ్ రంగంలో సైబర్ క్రైమ్ విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఆర్డినేటర్ డాక్టర్ డి నవీన్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సిహెచ్ వెంకటయ్య, ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ డాక్టర్ పి జ్యోతి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ కనీస్ ఫాతిమా , సంపత్, జీవవేణి భాస్కర్,రమేష్,భావన, భారతి, శేఖర్, శ్రీధర్, శ్రీకాంత్ తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.