calender_icon.png 24 October, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎధిర పీహెచ్‌సీ పరిధిలో కంటి పరీక్షల సర్వే

24-10-2025 12:00:00 AM

వెంకటాపురం(నూగూరు), అక్టోబర్ 23(విజయ క్రాంతి): జిల్లా అధికారులు ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదిర పరిధిలో గల గ్రామాలలో కంటి పరీక్షల కొరకు సర్వే నిర్వహించడం జరిగింది. ఏటూరి నాగారంలో ఉచిత కంటి పొర చికిత్స శిబిరం నిర్వర్తించినందున గ్రామాలలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తో గురువారం సర్వే నిర్వర్తించి సమస్య ఉన్న వారిని గుర్తించి బుధవారం నుండి ఈనెల 28వ తేదీ మంగళవారం వరకు సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి పొర చికిత్స శిబిరం నిర్వర్తించబడును.

కంటి శుక్లాలు, పొర గలవారికి మాత్రమే ఆపరేషన్ చేయబడును. అక్టోబర్ 26వ తేదీ నుండి 30వ తేదీ గురువారం వరకు జరుగును శిబిరానికి వెళ్లేవారుఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబర్ తీసుకెళ్లగలరని,గ్రామాలలో గ్రామస్తులకు తెలియపరుస్తున్నారు.దానితో పాటు అన్ని సబ్ సెంటర్స్ లో ఫోర్త్ రౌండ్ ఎన్ సి డి స్క్రీనింగ్ చేస్తున్నామని, బీపీ, షుగర్ లను కొత్తగా స్క్రీనింగ్, బీపీ షుగర్స్, ఉన్నవాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి మెడిసిన్ స్టార్ట్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెల్ పీహెచ్ అజ్మీర జ్యోతి,సూపర్వైజర్లు, పీహెచ్‌ఎన్ యాకమ్మ, హెచ్ ఈ ఓ కోటిరెడ్డి, ఏఎన్‌ఎం భారతి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.