24-10-2025 12:00:00 AM
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపాడు, అక్టోబర్23 (విజయక్రాంతి): పేదవారి ఆత్మ గౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇల్లు అని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం బూర్గంపాడు మండలం ఆయన పర్యటించారు. ఈ పర్యటనలు భాగంగా ముందుగా లక్ష్మీపురం గ్రామంలో ప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జమలారెడ్డి అధ్యక్షతన జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం ధ్యేయంగా ముందుకు పోతుందని అన్నారు. ఇప్పటికే నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లే తప్ప గత పది సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా కట్టించలేదని విమర్శించారు. ఆనాడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారు సంతోషంగా తాము పదిలంగా అల్లుకున్న ఇందిరమ్మ ఇల్లు అని ఆనందంతో అంటున్నారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం ఐటీడీఏ ద్వారా ప్రత్యేక కోటాలో మంజూరైన 139 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను,51మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం సారపాకలో పబ్లిక్ టాయిలెట్ నిర్మాణానికి, మసీదు రోడ్ లో రూ.3.45 కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంక్ మరియు అభివృద్ధి పనులకు, గాంధీనగర్ లో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మండల స్పెషల్ ఆఫీసర్ ఠాగూర్, తహశీల్దార్ ప్రసాద్, హౌసింగ్ ఏఈ, ఎంపీపీ బాలయ్య, మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రోసిరెడ్డి, మాజీ జడ్పిటిసి బట్టా విజయ్ గాంధీ, టీపీసీసీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ భజన సతీష్, మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, మండల నాయకులు కైపు శ్రీనివాస్ రెడ్డి, చల్ల వెంకటనారాయణ, భజన ప్రసాద్, యువజన నాయకులు పాల్గొన్నారు.