calender_icon.png 27 July, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకోవద్దు

25-07-2025 12:00:00 AM

  1. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇతర సంస్థలకు ట్రంప్ ఆదేశాలు
  2. అమెరికన్లపై దృష్టి సారించాలని సూచన
  3. వాషింగ్టన్‌లో జరిగిన ఏఐ సదస్సులో అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్, జూలై 24: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులపై మ రోసారి తన అసహనాన్ని వెళ్లగక్కారు. భారతీయ, ఇతర దేశాలకు చెందిన టెకీలను ని యమించుకోవద్దంటూ గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా ఇతర సంస్థలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికన్లపై దృష్టి సా రించాలని.. లేని పక్షంలో భారీ మూల్యం చె ల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

వాషింగ్టన్‌లో జరిగిన ఏఐ సమ్మిట్‌కు హాజరైన పలు అమెరికా టెకీ కంపెనీలను ఉద్దే శించి ట్రంప్ మాట్లాడారు. ‘మన దేశంలోని చాలా భారీ టెక్ కంపెనీలు నిర్మిస్తూ.. భారతీయ ఉద్యోగులను నియమించుకొంటూ.. ఐర్లాండ్‌ను అడ్డం పెట్టుకొని తక్కువ లాభా లు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయి. ఈ విషయం మీకు తెలుసు. ఇక్కడ ప్రజల అవకాశాలను పట్టించుకోకపోవడం, నిర్ల క్ష్యం చేయడం వంటివి చేశారు.

ట్రంప్ పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయి. ఏఐ రే సులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం. ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమే. దేశానికే మొదటి ప్రాధాన్యమిస్తూ పనిచేయాలి. మీరు అది చేయాలి. అదే నేను కోరుతున్నాను’ అని ట్రంప్ పేర్కొన్నారు. అ నంతరం ట్రంప్ అమెరికా కొత్త ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్ బ్లూప్రింట్‌ను విడుదల చేశా రు.

కీలక సాంకేతిక పరిజ్ఞానంలో చైనాపై అ మెరికా ఆధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నంలో పర్యావరణ నిబంధనలను సడలిం చడం, మిత్రదేశాలకు కృత్రిమ మేధ ఎగుమతులను విస్తరించడం లక్ష్యంగా ఈ కొత్త కృత్రి మ మేధ (ఏఐ)ను విడుదల చేశారు. 21వ శ తాబ్దాన్ని ఏఐ పోరాటంగా అభివర్ణించిన ట్రంప్.. చైనాతో సాంకేతిక ఆయుధ పోటీని వివరిస్తూ ఈ ప్రణాళికను విడుదల చేశారు.