25-07-2025 01:31:52 AM
బూర్గంపాడు, జూలై 24, (విజయక్రాంతి):ప్రభుత్వ/ప్రైవేటు/మైనారిటీ ఐటిఐ లలో మరియు ఆధునిక సాంకేతిక కేంద్రాలలో రెండో దఫా ప్రవేశాలు ప్రారంభమయినట్లు కృష్ణ సాగర్ ప్రభు త్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ ధర్మాచారి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కోర్సుల ప్రవేశాలకు అర్హతలు10 వ తరగతి/8వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అభ్యర్థు లు 01-08-2025 నాటికి కనీసం 14 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలని, గరిష్ట వయోపరిమితి లేదని ఆయన అన్నారు.అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను స్కాన్ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చే యాలని, అభ్యర్ధులు ఒకే దరఖాస్తు ద్వారా రాష్ట్రంలోని ఏదైనా ఐ.టి.ఐ./ఏటిసీ కు వెబ్ ఆప్షన్ల ద్వారా ఎంపికయ్యే అవకాశం ఉందని అన్నారు.
ఆన్లైన్ https://iti.telangana.gov.in ద్వారా దరఖాస్తులను ఏ నెల 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఫీజు రూ.100/-చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. దరఖాస్తులో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి తప్ప నిసరిగా ఇవ్వాలని,దరఖాస్తులో ఇచ్చిన సమాచారం మారితే సీటు రద్దు అయ్యే అవకాశం ఉం దని,మొదటి దఫాలో ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు
డబ్బులు చెల్లించకుండానే ఆప్షన్లను మా ర్చుకో వచ్చని,మొదటి దఫాలో ధరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు రెండోవ దఫా లో కొత్తగా దరఖాస్తు చేసుకోగలరని,రిజర్వేషన్ నిబంధనల ప్రకారం, వెట్ ఆప్షన్ల ఆధారంగా సీట్లు కేటాయించ బడతాయని, ఎంపికైన అభ్యర్ధులకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు.అభ్యర్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తగిన ధృవపత్రాలతో ధరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.