calender_icon.png 1 January, 2026 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏయూలో సేల్స్ ఫోర్స్ ఏజెంట్ ఎక్స్ హ్యాకథాన్

01-01-2026 12:00:00 AM

ఘట్ కేసర్, డిసెంబర్ 31 (విజయక్రాంతి) : వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీ, సమాచార సాంకేతిక (ఐటీ) విభాగం ఆధ్వర్యంలో  రెండు రోజుల పాటు సేల్స్ ఫోర్స్ ఏజెంట్ ఎక్స్ హాకెథన్ బూట్ క్యాంప్ ను నిర్వహించారు. ఈ బూట్ క్యాంప్ ప్రధాన లక్ష్యం విద్యార్థులకు సేల్స్ ఫోర్స్ ఆధారిత ఆధునిక సాంకేతికతలపై లోతైన అవగాహన కల్పించడం, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం అన్నారు. ఈకార్యక్రమానికి ప్రముఖ సేల్స్ ఫోర్స్ నిపుణులు ముఖ్య అతిథులు, వక్తలుగా పాల్గొన్నారు. సునీల్ కుమార్ తరువు ఆ లైన్ టెక్నాలజీ సంస్థలో లీడ్ సేల్స్ ఫోర్స్ డెవలపర్ ట్విలియో నిపుణుడిగా పనిచేస్తున్నారు.

ఆయన విద్యార్థులను ఉద్దేశించి  రిలయన్స్ సేల్స్ ఫోర్స్  ఎకోసిస్టమ్లో ఉన్న అవకాశాలు, రియల్-టైమ్ అప్లికేషన్లు, అలాగే ప్రస్తుత పరిశ్రమ అవసరాలపై విలువైన అవగాహనను అందించారు. ఈబూట్క్యాంప్లో భాగంగా హ్యాండ్స్-ఆన్ సెషన్లు, లైవ్ డెమోలు సమస్య పరిష్కార కార్యక్రమాలు నిర్వహించబడినవి. విద్యార్థులు ఎంతో ఆసక్తితో పాల్గొని, వాస్తవ ప్రపంచ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు రూపొందించే అనుభవాన్ని పొందారు. ఈకార్యక్రమం విద్యార్థులలో సేల్స్ ఫోర్స్ పట్ల నూతన ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలు మరియు పరిశ్రమపై అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని ఐటీ విభాగాధిపతి డాక్టర్  నితీషా శర్మ తెలిపారు. ఈఅవకాశాన్ని కల్పించిన డీన్, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డాక్టర్ విజయ్ కుమార్ కి, అలాగే అనురాగ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ బృందానికి ఐటీ విభాగం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.