calender_icon.png 6 May, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పన్నెండున్నరేళ్లుగా అపవాదు మోస్తూ వచ్చాను: సబితా ఇంద్రారెడ్డి

06-05-2025 07:06:36 PM

హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసు(Obulapuram Mining Case)లో నాంపల్లి సీబీఐ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇవ్వడంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(BRS MLA Sabitha Indra Reddy) హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... పన్నెండున్నరేళ్లుగా కోర్టులో ఓఎంసీ కేసు నడుస్తోందని ఆమె అన్నారు. నన్ను నిర్దోషిగా ప్రకటించిన న్యాయ వ్యవస్థకు సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గత పన్నెండున్నర ఏళ్ల క్రితం ఈ కేసు ప్రారంభమైనప్పుడు తను కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కానట్లు తెలిపారు. ఏ తప్పు చేయనప్పటికీ ఓబులాపురం మైనింగ్ కేసులో ఇరికించరాని, ఈ కారణంగా ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నట్లు సబితా వెల్లడించారు.

ఈ రోజు ఆమె నమ్మకం సరైనదని నిరూపించబడిందని సబితా ఇంద్రారెడ్డి స్పష్టంగా భావోద్వేగంతో అన్నారు. ఇన్ని ఏళ్లు తాను ఎదుర్కొన్న మానసిక బాధను కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారు నన్ను అవినీతిపరురాలిగా చిత్రీకరించి, నన్ను జైలుకు పంపుతారని పుకార్లు వ్యాపింప చేసినప్పటికి, తన నియోజకవర్గ ప్రజలు మాత్రం తనకు ఎల్లప్పుడు అండగా నిలబడ్డారని అభిప్రాయపడ్డారు. ఈ క్లిష్ట సమయాల్లో నాకు మద్దతుగా నిలిచి నాకు ధైర్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తీర్పు వెలువరించినందుకు సబితా ఇంద్రారెడ్డి న్యాయవ్యవస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.