10-12-2024 12:03:57 AM
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో హర్యానా స్టీలర్స్ జోరు కొనసాగు తోంది. వరుస విజయాలతో పట్టికలో టాప్ లో కొనసాగుతున్న హర్యానా తాజాగా తెలు గు టైటాన్స్‌పై రికార్డు విజయం సాధించింది. సోమవారం పుణే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ను 25 హర్యానా ఖంగుతినిపించింది.
హర్యానా తరఫున శివమ్ పటారే (12 పాయింట్లు) సూపర్ టెన్ సాధించగా.. ఆడిన 18 మ్యాచ్‌ల్లో 10 విజయాలతో టైటాన్స్ ఐదో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 30 తేడాతో పునేరి పల్టన్‌ను ఓడించింది. ఢిల్లీ తరఫున కెప్టెన్ ఆశు మాలిక్ (13 పాయింట్లు) సూపర్ టెన్‌తో మెరవగా.. పల్టన్ రెయిడర్ మోహిత్ 7 పాయింట్లు సాధించాడు.