12-11-2025 08:04:16 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): నవభారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, పాల్వంచ తన సామాజిక కార్యక్రమాలలో భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రం-శేఖర బంజర్ నందు బుధవారం సురక్షిత మంచినీటి కేంద్రం(100LPH), సబ్మెర్సీబుల్ మోటార్ ఏర్పాటు చేశారు. ఈ కారక్రామానికి ముఖ్య అతిధిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణకుమారి మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా నీటి సదుపాయాలు లేక వైద్య కేంద్రంకు విచ్చేసినటువంటి రోగులు అనేక ఇబ్బందులు పడ్డారని, ఆ విషయం 'నవ లిమిటెడ్' యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా సత్వరమే సురక్షిత మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు.
ఈ సురక్షిత మంచినీటితో రోగాలు చాలా వరకు నివారణ అవుతాయాని తెలిపారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ ఇప్పటిదాక పనిచేసిన వేరే జిల్లాలలో ఏ కార్పొరేట్ సంస్థ ప్రభుత్వ వైద్య కేంద్రంకు ఇలాంటి మంచి కార్యక్రమములు చేయడం చూడలేదని 'నవ ' గ్రూప్ కృషిని ఆయన కొనియాడారు. జనరల్ మేనేజర్. సి. యస్. ఆర్ ఎమ్ జి ఎమ్ ప్రసాద్ మాట్లాడుతూ పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి, రామవరం తల్లి పిల్లల వైద్య కేంద్రంమునకు ఆక్సీజన్ పాయింట్స్ ఏర్పాటు చేశామని, అలాగే ఈ సంవత్సరము పాల్వంచ ప్రభుత్య ఆసుపత్రికి రోగుల కోసం వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమనికి నవ లిమిటెడ్ ప్రతినిధి డి జి యం (HR) శ్రీనివాస రెడ్డి, శేఖర బంజర గ్రామ పెద్ద బాలు నాయక్, కిషోర్, గాంధీనగర్ గ్రామ పెద్దలు రాము, లాలు, శంకర్, కిషన్, సి యస్ ఆర్ సిబ్బంది రాజేష్, వెంకన్న, బాలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.