calender_icon.png 12 November, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

12-11-2025 08:01:57 PM

సిద్దిపేట క్రైం: తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా జరిగింది. జాతీయ సేవ పథకం ఒకటి నుంచి 7 యూనిట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యాభివృద్ధికి ఆజాద్ చేసిన కృషిని కళాశాల ప్రిన్సిపాల్ జి.సునీత కొనియాడారు. ఐపీఎస్సీ కోఆర్డినేటర్ డాక్టర్ సీహెచ్ మధుసూదన్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ గోపాల సుదర్శన్, ఎన్ఎస్ఎస్ 7 యూనిట్ల ప్రోగ్రామ్ ఆఫీసర్లు జి.బాలకిషన్, డాక్టర్ ఎన్.హరిబాబు, డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి, డాక్టర్ శైలజ డాక్టర్ మహేష్ కుమార్, కె.విశ్వనాథం ఇతర విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు, వలంటీర్లు పాల్గొన్నారు.