calender_icon.png 16 January, 2026 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి: ఎస్ఐ మహేష్

16-01-2026 05:28:30 PM

ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి– ఎస్ఐ మహేష్ 

చివ్వెంల,విజయక్రాంతి: అరైవ్ ఎలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమంలో భాగంగా శుక్రవారం చివ్వెంల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉద్యోగులు, స్థానిక పౌరులకు రోడ్డు భద్రత నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ, అజాగ్రత్త వల్లే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ వినియోగించాలని కోరారు. ప్రస్తుత సమాజంలో ముఖ్యంగా యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారని, దీని వల్ల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనాలు నడపాలని, రోడ్డు మీద క్రమశిక్షణ పాటిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.