calender_icon.png 16 January, 2026 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెలు సంప్రదాయాలకు నిలయాలు

16-01-2026 05:30:34 PM

600 మంది మహిళా మణుల ముగ్గులతో కలకలలాడిన కీతవారిగూడెం

గరిడేపల్లి,(విజయక్రాంతి): పల్లెలు సాంప్రదాయానికి నిలయాలని గ్రామంలో సంక్రాంతి పండుగను ఐక్యతతో ముందుకు సాగాలని కీతవారిగూడెం గ్రామ సర్పంచ్ బొల్లేపల్లి రామనాథం గౌడ్,పిఎసిఎస్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ అన్నారు.మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పార్టీలకు అతీతంగా యువత ముగ్గుల పోటీలను నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ పండగలు ప్రకృతి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని పలువురు పేర్కొన్నారు.మహిళల కోసం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో మొత్తం 600 మంది మహిళలు పాల్గొనగా మొదటి మూడు బహుమతులతో పాటు అందరికీ బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు దాసరి శ్రీనివాసరావు,సంక బుడ్డి నరసయ్య,బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు పోలంపల్లి ఆనంద్ బాబు,గుండు రాంబాబు గౌడ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చింతకాయల సైదులు,హుజూర్నగర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పెడమర్తి అంజి,గుండు వీరబాబు గౌడ్,కళాకారులు బాదే నరసయ్య,రేఖ వెంకట నరసయ్య,గుండు సైదులు,కీత పరశురాం,మొగిలి సైదులు,భూతం సరిత,దాసరి గోపి,దొంతగాని తార లక్ష్మయ్య,బడేటి పద్మ లింగయ్య,వెంకటేశ్వర్లు,దాసరి ఆంజనేయులు,కనకయ్య,గుండు సురేష్,దాసరి నాగేంద్రబాబు,అమరగాని బక్కయ్య,షేక్ సైదా హుస్సేన్,జుట్టుకొండ సతీష్,మండవ నాగేశ్వరరావు,వేణు,హుస్సేన్ ,శేఖర్,మణిదీప్,నరసింహ,సతీష్,నరేష్,వినోద్ మహిళలు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు