calender_icon.png 5 October, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్ 26 గేట్లు ఎత్తివేత

05-10-2025 12:43:35 AM

-587.50 అడుగులకుచేరిన నీటిమట్టం

-జూరాల నుంచి శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

-శ్రీశైలం 10 గేట్ల నుంచి నీటి విడుదల

-ఎస్‌ఆర్‌ఎస్పీకి భారీ వరద.. 20 గేట్లు ఎత్తిన అధికారులు

హైదరాబాద్, అక్టోబర్ 4(విజయక్రాంతి): నాగార్జున సాగర్ డ్యామ్‌కు శ్రీశైలం నుంచి వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 26 గేట్లు ఎత్తి ఐదు అడుగుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అక్కడి నుంచి శ్రీశైలానికి వరద ఉధృతి కొనసాగుతున్నది. దీంతో శ్రీశైలం 10 గేట్లను అధి కారులు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

దీంతో నల్లగొండ జిల్లాలోని నాగా ర్జున సాగర్‌కు భారీ వరద వస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 587.50 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను 305.80 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 2.58 లక్షల క్యూసెక్సులు ఇన్‌ఫ్లో వస్తుండగా, అధికారులు 26 గేట్లు ఎత్తడంతో అంతే మొత్తంలో దిగువకు ఔట్‌ఫ్లో నమదవుతున్నది. స్పిల్ వే ద్వారా 2.03 లక్షల క్యూసెక్కులు వెళ్తున్నది. 

ఎస్‌ఆర్‌ఎస్పీకి భారీగా వరద 

నిజామాబాద్ జిల్లాలోని గోదావరి నదిపై నిర్మించిన శ్రీపాద ఎల్లం పల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువన శ్రీరామ్‌సాగర్, నదీ పరివాహక ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొనసాగుతున్నది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1.82 లక్షల క్యూసె క్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 2.05 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు పరుగులు తీస్తున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.89 టీఎం సీల నీరు నిల్వ ఉన్నది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.