రైతుకు అండగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి
కరీంనగర్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): రైతులకు ఎల్లప్పుడూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పండించిన ధాన్యం అమ్ముకోవడానికి గతంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్,ఫకీర్ పేట్ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అనేక ఇబ్బందులు పెట్టారని తప్ప, తాలు పేరు మీద అనేక ఇబ్బందులు పెట్టారని అన్నారు.
రైతును రాజును చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పుల ఖజానా అప్పజెప్పినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుకు అండగా నిలవడం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాలలో ఎపిఎం రామ్మోహన్, సిసి లు కృష్ణ,అశోక్,పిఏసిఎస్ సిఇఓ రమేష్,సర్పంచులు సుద్దాల కమలాకర్, బొద్దుల విజయ లక్ష్మి లక్ష్మణ్, వివో సునీత, తదితరులు పాల్గొన్నారు.






