25-09-2025 12:00:00 AM
సాయిపల్లవిని ‘కలైమామణి’ అవార్డు వరించింది. తమిళనాడులోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఇదొక్కటి కావటం విశేషం. సంగీతం, సాహిత్యం, నాటకం, సినిమా వంటి కళారంగాల్లో సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. 2021, 22, 23 సంవత్సరాలకు గాను ఏడాదికి 30 మందికి చొప్పున మొత్తం 90 మంది కళాకారులకు ప్రభుత్వం ‘కలైమామణి’ పురస్కారాలను బుధవారం ప్రకటించింది.
2021 సంవత్సరానికి సాయిపల్లవికి ఈ అవార్డు దక్కింది. నటుడు, దర్శకుడు- ఎస్‌జే సూర్య, దర్శకుడు లింగుసామి, నటుడు విక్రమ్ ప్రభు, మణికందన్‌లు కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సహా ఆరుగురికి ఈ పురస్కారం లభించింది. జాతీయ పురస్కారాల విభాగంలో ప్రముఖ నేపథ్య గాయకుడు కేజే ఏసుదాస్‌కు ఎంఎస్ సుబ్బులక్ష్మి పురస్కారాన్ని ప్రకటించారు. ఈ అవార్డులను అక్టోబర్‌లో ప్రదానం చేస్తారు.