25-09-2025 05:21:40 PM
నిర్మల్,(విజయక్రాంతి): దసరా దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి వేషధారనలో ఓ చిన్నారి అందర్నీ అలరింపజేసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంట వాడకి చెందిన అమ్ముల సిద్దు. మనస్వీ కూతురు అమ్ముల మణి చైత్ర గురువారం దుర్గాదేవి వేషధారణలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజించింది. దీని ద్వారా పిల్లల్లో భారతీయ సాంస్కృతి, సంప్రదాయాల గురించి అవగాహన కల్పించడమే కాకుండా వారిలో దేశభక్తి పెంపొందించేలా చైతన్య పరుస్తుందని ఈ చిత్రాన్ని చూసిన పలువురు నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు. ఈ చిన్నారి ఆధ్యాత్మికంగా భక్తి గీతాలు ఆలపించడం ఓ విశేషం..