calender_icon.png 25 September, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయపెట్టే ఓ చెలియా

25-09-2025 12:00:00 AM

నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్యరెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఓ చెలియా’. కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని ఎం నాగరాజశేఖర్‌రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఎస్‌ఆర్‌ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాకు రూపాశ్రీ కొపురు నిర్మాత. ఇప్పటికే సినిమా పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ సినీప్రియులకు చేరువయ్యాయి. ఇటీవల స్టార్ హీరో మంచు మనోజ్ ఈ చిత్రం ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.

తాజాగా బుధవారం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ టీజర్‌ను గమనిస్తే.. హారర్, లవ్, యాక్షన్ జానర్లను మిక్స్ చేసినట్టు అనిస్తోంది. హారర్ కాన్సెప్ట్‌లో చేసిన ప్రేమకథ ఏంటి? మధ్యలోకి ఈ దెయ్యాల కాన్సెప్ట్ ఎలా వచ్చింది?

అన్న ఆసక్తికర అంశాలతో ఉత్కంఠభరితంగా ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. టీజర్‌లో సురేశ్ బాలా కెమెరా వర్క్, ఎంఎం కుమార్ ఆర్‌ఆర్ హైలెట్ అవుతోంది. ఈ చిత్రానికి ఉపేంద్ర ఎడిటర్‌గా పనిచేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.