calender_icon.png 25 September, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెట్ పరీక్షపై ఉపాధ్యాయులు ఆందోళన చెందవద్దు

25-09-2025 05:13:47 PM

నిర్మల్,(విజయక్రాంతి): టెట్ పై ఎలాంటి ఉపాధ్యాయులు ఆందోళన అవసరం లేదని ఎస్టీయూ టియస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. రవి, జి. సదానందం గౌడ్ లు అన్నారు.  స్థానిక పెన్షనర్ల సంఘ భవనంలో జిల్లా అధ్యక్షుడు ఎస్. భూమన్న యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఎస్టీయూ సమావేశానికి హాజరయ్యారు. సంఘ వార్షిక కౌన్సిల్ సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల టెట్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు క్షేత్రస్థాయిలో అమలు చేయడం సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

విద్యార్హతలకు సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని అన్నారు. టెట్  పై సంఘ పక్షాన న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. ఉపాధ్యాయుల జి.పి.ఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్, సరెండర్ లీవ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర ట్రెజరీ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇన్ని పెండింగ్ డిఏలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేవన్నారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకొని వెంటనే అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు నిరంతరం పదోన్నతులు నిర్వహించేలా పాలసీని రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

సర్వీస్ రూల్స్‌ రూపొందించి, అర్హులైన ఉపాధ్యాయులకు ఎంఈఓ, డిప్యూటీ ఈవో, డైట్‌, జూనియర్‌ లెక్చరర్‌ పదోన్నతులు కల్పించుటకు సంఘం కృషి చేస్తోందన్నారు. కేజీబీవీ, గిరిజన సంక్షేమ శాఖ సిఆర్టీలకు టైంస్కేల్ వర్తింపజేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఓపీఎస్ ను అమలు  చేయాలన్నారు. రాష్ట్ర నాయకులు జుట్టు గజేందర్,  జిల్లా ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్, 19 మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కౌన్సిలర్లు పాల్గొన్నారు. సంఘ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.రవీంద్ర పర్యవేక్షణలో ఎన్నుకొన్నారు.