25-09-2025 05:03:14 PM
హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి నాయిని నీలిమ రెడ్డి, దేవి శరన్నవరాత్రి ఉత్సవాల శుభ సందర్భంగా గురువారం వరంగల్ చారిత్రక వేయి స్తంభాల దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అమ్మవారికి నిర్వహించిన లక్ష పుష్పార్చనలో పాల్గొన్నారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, సమాజ శాంతి, సౌభాగ్యం, ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు వేదమంత్రాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తజనులతో కలిసి పూజల్లో పాల్గొన్న నాయిని నీలిమ రెడ్డి దేవి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.