25-09-2025 05:25:39 PM
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీఐ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం ఉమ్మడి వరంగల్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్ ఈ కార్యక్రమానికి హాజరై పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ... సమాచార హక్కు చట్టం సాధన కమిటీ అనేది భారత సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం, ప్రధాన సమాచార కమిషనర్, ఇతర సమాచార కమిషనర్ల నియామకానికి సిఫారసులు చేసే కమిటీ అని, ఈ కమిటీ లో ప్రధానంగా కేంద్రపాలకులు, ముఖ్యమంత్రి, పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు మొదలైన వారు సభ్యులుగా ఉంటారని,సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 12 ప్రకారం, ఈ కమిటీకి చోటు ఉంటుందని, ప్రధానమంత్రి కమిటీ చైర్మన్‌గా ఉంటూ, తదితర సభ్యులు ఇందులో భాగస్వామ్యం అవుతారన్నారు.