calender_icon.png 23 May, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో సైనిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలి

23-05-2025 12:00:00 AM

  1. సైనిక్ పాఠశాల ఏర్పడేంత వరకు తెలంగాణ విద్యార్థులను ఏపీ సైనిక్ స్కూళ్లలో స్థానికులుగానే పరిగణించాలి 
  2. ప్రభుత్వానికి క్రాంతి కీన్ ఫౌండేషన్ విజ్ఞప్తి

ఖైరతాబాద్, మే 22 (విజయక్రాంతి) : తెలంగాణలో కొత్త సైనిక్ పాఠశాలలు ఏర్పడేంత వరకూ ఎపి సైనిక్ స్కూళ్లలో రాష్ట్ర విద్యార్థులకు స్థానికత కోటా కొనసాగించాలని క్రాంతి కీన్ ఫౌండేషన్ జాయింట్ సెక్రటరీ కల్యాణి కోరారు. ఎపి ప్రభుత్వ నిర్ణయంతో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష రాసిన 20వేల మంది తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగు తుందని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గురువారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల్లో సైనిక్ స్కూళ్లు ఉన్నాయని. తెలంగాణలో ఒక్కటి కూడా లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా తెలంగాణలో కనీసం మూడు సైనిక్ స్కూళ్లు ఏర్పాటయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు  విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే ఈ విషయమై రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిసి విన్న వించామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 20వేల మంది విద్యార్థులు రూ.800 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించి సైనిక్ స్కూల్ పరీక్ష రాశారన్నారు. ఫలితాల విడుదలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఎపిలోని కోరుకొండ సైనిక్ పాఠశాల ప్రిన్సిపాల్ తెలంగాణ విద్యార్థులకు ఎపి సైనిక్ పాఠశాల్లో స్థానికత లేదని ప్రకటించడం ఇన్యాయమన్నారు.

నోటిఫికేషన్ ముందు ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఇలాంటి ప్రకటన చేయడంతో విద్యార్థులు. వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. గతంలో ఎపితో ఉన్న స్కూళ్లలో తెలంగాణ వారిని లోకల్ వాళ్లుగా పరిగణించేవారని గుర్తుచేశారు.

వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎపి ప్రభుత్వ సంబంధిత శాఖలు స్పందించి తెలంగాణ విద్యార్థులకు ఎపి సైనిక్ పాఠశాలల్లో 67శాతం స్థానికత కోటా పనరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశంలో పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.