calender_icon.png 24 May, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రగతి చక్ర అవార్డులు...

23-05-2025 07:47:01 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ ఏర్పాటు చేశారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఎప్రిల్ నాలుగు నెలలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 20 మంది ఉద్యోగులకు డిపోమేనేజర్ కే.పండరి శాలువలతో సత్కరించి  ప్రశంషా పత్రాలు అందచేశారు. బస్సుకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం తెచ్చిన కండక్టర్లకు,డీజిల్ ఆయిల్ పొదుపు చేసిన డ్రైవర్లకు ఈ గౌరవం దక్కింది.మిగితా ఉద్యోగులు కూడా వీరిలాగే  ఆయిల్ పొదుపు పాటించి మంచి ఆదాయం తీసుకు వచ్చి డిపోను అభివృద్ధి బాటలో నడుపుతారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమములో అసిస్టెంట్ మేనేజర్ ఐ రాజశేఖర్ ఉద్యోగులు పాల్గొన్నారు.