23-05-2025 07:49:52 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వారి తీరు అనుమానంగా కనిపించడంతో వారిని సోదా చేయగా వారి వద్ద 75 వేల రూపాయల విలువైన కిలోన్నర ఎండు గంజాయి లభించినట్టు మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య తెలిపారు.
ఈ సంఘటనలో మొగిలిచర్ల గ్రామానికి చెందిన జీ.చందు, ఎస్.నాగరాజు, ఉపేందర్ ను అరెస్ట్ చేసి పల్సర్ బైక్, 3 సెల్ ఫోన్లు, పట్టుబడ్డ గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు సిఐ వివరించారు. ఈ ఘటన వెనుక ఉన్న మిగతా వారి గురించి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. గంజాయిని పట్టుకొన్న పి ఎస్ ఐ జి.వి కృష్ణ రెడ్డి , పోలీస్ సిబ్బందిని సిఐ అభినందించారు.