calender_icon.png 23 May, 2025 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిల్పారామంలో.. అందెగత్తెల సందడి

23-05-2025 12:00:00 AM

విక్టోరియా హోమ్‌లో విద్యార్థులతో ఆటాపాట

శేర్లింగంపల్లి/ఎల్బీనగర్, మే 22: మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్పారామంలో గురువారం వివిధ దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. వారికి తెలంగాణ కళాకారులు సంప్రదాయ మంగళ వా ద్యాలతో, నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. చిన్నారులు పట్టు లంగా ఓణీల్లో, యువకులు ధోతి కుర్తాల్లో అలరించారు. శిల్పారామం ప్రాం గణంలో ఏర్పాటు చేసిన వివిధ కళాశిల్పాల ప్రదర్శనలు, హస్తక ళల స్టాళ్లు వీరిని ఎంతో ఆకట్టుకున్నా యి.

గలిచె పనులు, పట్టు బట్టలు, లంబాడీ గాజులు, చెక్క శిల్పాలు మొ దలగు ప్రత్యేకమైన వస్తువుల ను ఆసక్తిగా తిలకించారు. స్థానిక ఆహార పదార్థాలపై కూడా ఆసక్తి కనబరిచారు. జొన్నరొట్టె, సరకరా జిలేబీ, గోం గూర పచ్చడి వంటి ప్రత్యేక వంటకాలను ఆస్వాదించారు. సరూర్ నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్‌ను సైతం ప్ర పంచ సుందరీమణులు సందర్శించారు. వీరి పర్యటన నేప థ్యంలో రాచకొండ పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు.

ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో విద్యార్థులతో ఆడిపాడారు. ఈ సందర్భంగా విక్టోరియా హోమ్ విద్యార్థినులకు బహుమతులు అందించారు. ఆయా కార్యక్రమాల్లో మిస్ వరల్డ్ చైర్‌పర్సన్ మోర్లే, పర్యాటకశాఖ డైరెక్టర్ హనుమంతు, రాచకొండ సీపీ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.