23-05-2025 07:44:21 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన తిమ్మంపేట కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కటికనేని అశోక్ కుమార్ మండల ఆర్ఎంపీ వైద్యుల సంఘం తరపున రూ.16 వేల ఆర్థిక సహాయం శుక్రవారం అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు కొమరయ్య, రాంబాబు, వెంకటేశ్వరావు, సుబ్రహ్మణ్యం, నాగరాజు విశ్వాస్, రఫీ, రాము తదితరులు పాల్గొన్నారు.