సైరాబాను వినోదాత్మక ప్రయాణం
ఆది సాయికుమార్ మరో కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘సైరాబాను’ పేరుతో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు ‘ఏ ఫన్ ఫిల్డ్ జర్నీ ఆఫ్ లవ్, ఫేత్ అండ్ డెస్టినీ’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఇందులో ఆది సాయికుమార్ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకునే లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన వెనుక హీరోయిన్ బాంధవి శ్రీధర్ నల్లటి హిజాబ్ ధరించి కూర్చుని, ఆది భుజాలపై ఆప్యాయంగా చేతులు వేసుకున్న తీరు వారి మధ్య ప్రేమను హైలైట్ చేస్తోంది.
ప్రేమ, మతం, సంస్కృతుల మధ్య ఉన్న భిన్నత్వాన్ని ఆసక్తికరమైన కథాంశంతో మేళవించిన సినిమా ఇదని ఫస్ట్ లుక్ ద్వారా అర్థమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న ఈ చిత్రానికి రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కదలి ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.






