మరో పండుగ సినిమాకు క్లాప్ కొట్టేసిన శర్వా!
చార్మింగ్ స్టార్ శర్వానంద్ తొలిసారిగా దర్శకుడు శ్రీను వైట్లతో జతకట్టారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తిస్థాయి కుటుంబ కథాచిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్ పెట్టారు. ఈ మేరకు ఓ కలర్‌ఫుల్ పోస్టర్ ద్వారా చిత్రబృందం టైటిల్, విడుదల తేదీని ప్రకటించింది. శర్వా సంక్రాంతి సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ఈ కొత్త సినిమాను 2027 జనవరి 14న పండుగ సీజన్‌లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
ఈ చిత్రం శుక్రవారం సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సురేశ్‌బాబు కెమెరాను స్విచ్ ఆన్ చేయగా, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టారు. దర్శకుడు శ్రీను వైట్ల స్వయంగా మొదటి షాట్‌కు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్ కాగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, అమర్‌రెడ్డి కుడుముల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.






