10-05-2025 03:46:07 PM
అమర వీర జవాన్ నివాళ్ళు...
ఆదిలాబాద్,(విజయక్రాంతి): యుద్ధం ఎప్పుడూ వచ్చిన దాన్ని ఢీ కొట్టడానికి దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని, ముఖ్యంగా యువత ముందు వరుసలో ఉండాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Khanapur MLA Vedma Bhojju Patel) పిలుపు నిచ్చారు. శనివారం ఉట్నూర్ లో వేడ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రముఖలతో వీరోచితంగా పోరాడి అమరుడైన వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం 2నిమిషాల మౌనం పాటించారు. అనంతరం మాజీ జవాన్ లు డాకురే శత్రుఘన్, నరోటె వినాయక్ లను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యుద్ధమే వస్తే నేను సైతం తుపాకీ పట్టి రణరంగంలో ఉండి పోరాడుతానని స్పష్టం చేశారు. దేశం కోసం అమరుడైన జవాన్ మురళి నాయక్ త్యాగం వృధా పోదని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వెడ్మ ఫౌండేషన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, యువతి, యువకులు పాల్గొన్నారు.