10-05-2025 03:47:45 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల నగర కార్పొరేషన్(Mancherial City Corporation) పరిధిలోని గుడిపేట వద్ద నిర్మాణమవుతున్న మెడికల్ కళాశాల పనులను బి.ఆర్.ఎస్ నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలం గుడిపేటలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెడికల్ కళాశాల మంజూరు అయిందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేశారన్నారు. త్వరలోనే సేవలు అందిస్తుందన్నారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు వెంట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.