19-11-2024 12:00:00 AM
బెంగళూరు: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొత్త బౌలింగ్ కోచ్‌గా ఓంకార్ సల్వీ ఎంపికయ్యాడు. గత సీజన్‌లో ముంబై రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ నెగ్గడంలో ఓంకార్‌దే కీలకపాత్ర. ఈ నేపథ్యంలో సల్వీని బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు ఆర్సీబీ యాజమాన్యం ట్వీట్ చేసింది.