19-11-2024 12:00:00 AM
హైదరాబాద్: మలేషియాతో జరిగిన ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. మలేషియా తరఫున ఆట 19వ నిమిషంలో పాలో జోస్ గోల్ సాధించగా.. రాహుల్ బెకె (ఆట 39వ నిమిషం) భారత్‌కు ఏకైక గోల్ అందించాడు. మ్యాచ్ డ్రాతో ఒక్క విజయం లేకుండానే భారత్ ఈ ఏడాదిని ముగించింది. ఇగోర్ స్టిమాక్ అనంతరం కోచ్ బాధ్యతలు చేపట్టిన మనోలో విజయం కోసం వచ్చే ఏడాది ఎదురుచూడాల్సిందే. మనోలో ఆధ్వర్యంలో భారత్ నాలు గు మ్యాచ్‌లు ఆడగా.. మారిషస్, వియత్నాం తో డ్రా చేసుకున్న టీమిండియా సిరియాతో మ్యాచ్‌లో ఓటమి పాలైంది.