calender_icon.png 10 December, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14న తేజస్ స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్

10-12-2025 05:03:00 PM

ముకరంపుర (విజయక్రాంతి): తేజస్ ఐఐటి, నీట్ అకాడమీ ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులలో ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈనెల  14న ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు తేజస్ అకాడమీలో స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్- 2025 నిర్వహించనున్నట్లు తేజస్ అకాడమీ చైర్మన్ సిహెచ్ సతీష్ రావు తెలిపారు. బుధవారం స్కాలర్షిప్ టెస్టు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తి గల విద్యార్థులు స్కాలర్షిప్ టెస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ లో మెరిట్ సాధించిన విద్యార్థులకు 10 నుంచి 50% వరకు ట్యూషన్ ఫీజులో రాయితి ఇస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 8106310960, 8106366661, 9849466661 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపల్ జి కిషన్ రెడ్డి, అధ్యాపక, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.