21-11-2025 12:00:00 AM
అలంపూర్ నవంబర్ 20 : ఏఐసీసీ కార్యదర్శి కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ జన్మదిన వేడుకలు గురువారం అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లో సంపత్ కుమార్ నివాసంలో ఆయన కేకును కట్ చేశారు. అనంతరం నాయకులు సంపత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు... భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో అలంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్డాకుల రాము, సీనియర్ నాయకులు బైరాపురం రాజు, పాండు, వెంకటేష్, మద్దిలేటి తుమ్మల మహేష్ తదితరులు పాల్గొన్నారు.