calender_icon.png 21 November, 2025 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రీతం కుమార్ మృతి

21-11-2025 12:00:00 AM

రాజేంద్రనగర్, నవంబర్ 20 (విజయ క్రాంతి): గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేంద్రనగర్ కు చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రీతం కుమార్ మృతి చెందారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన ఆయన మధ్యా హ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వసత గురై ఇంట్లోనే ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించే లేపే అతను ఇంట్లోనే ప్రాణాలను విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికులు తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర దిగ్భ్రాంతికి  లోన య్యారు.

2001లో ఏర్పడిన తెలంగాణ ఉద్యమం నాటి నుంచి అలుపెరుగని నాయకుడిగా అనేక ఉద్యమాలు, పోరా టాల్లో  పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కుటుంబాన్ని పట్టించుకోకుండా తెలంగాణ సాధనేద్యేయంగా పనిచేసిన గొప్ప నాయకుడని బీఆర్‌ఎస్ నాయకులు కొనియా డారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన అంతక్రియలు రాజేంద్రనగర్‌లో జరుపుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.