calender_icon.png 21 November, 2025 | 4:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లపై వ్యర్థాలు వేస్తే రూ.15 వేల ఫైన్

21-11-2025 12:00:00 AM

  1. నార్సింగిలో ట్రాక్టర్ సీజ్

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి

మణికొండ, నవంబర్ 20 (విజయక్రాంతి) : నార్సింగి పురపాలక సంఘం పరిధిలో రోడ్ల పక్కన నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ వ్యర్థాలను వేస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ టి. కృష్ణమోహన్ రెడ్డి హెచ్చరించారు. కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం పారిశుద్ధ్య పర్యవేక్షణ అధికారి లచ్చిరాం తనిఖీలు నిర్వహిం చారు.

రోడ్డు పక్కన చెత్తను డంప్ చేస్తున్న ఒక ట్రాక్టర్ను అధికారులు పట్టుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు శీను అనే వ్యక్తికి రూ.15,000 జరిమానా విధించారు. ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు రోడ్లపై చెత్తాచెదారం వేయకూడదని, లేనియెడల భారీ జరిమానాలతో పాటు చట్టపర మైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.