01-05-2025 01:07:08 AM
పూర్వాజ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కిల్లర్’. జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఏయూఅండ్‌ఐ, మెర్జ్ ఎక్స్‌ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఏ పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ గ్లింప్స్‌ను తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు మేకర్స్.
మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో వంటి ఎలిమెంట్స్‌తో గ్లింప్స్ ఆద్యం తం ఆసక్తికరంగా సాగింది. ఆత్మ కలిగిన యంత్రాలు చూస్తారంటూ ప్రాచీన వైమానిక శాస్త్రంలో చెప్పిందే నిజం కాబోతోందా? అంటూ ఈ గ్లింప్స్ ప్రారంభమైంది. సూపర్ షీ క్యారెక్టర్‌లో జ్యోతిరాయ్ చేసిన స్టన్నింగ్ యాక్షన్, సెటిల్డ్ పర్‌ఫార్మెన్స్ హైలైట్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జగదీశ్ బొమ్మిశెట్టి; సంగీతం: ఆశీర్వాద్, సుమన్ జీవ.