23-01-2026 05:01:54 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ నూతన కమిషనర్ జె సంపత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో మునిసిపల్ కమిషనర్ల బదిలీలు చేపట్టారు. అందులో భాగంగా బెల్లంపల్లి కమిషనర్ తన్నీరు రమేష్ ములుగు మున్సిపాలిటీకి బదిలీ చేశారు. అక్కడ పనిచేసిన సంపత్ రెడ్డినీ బెల్లంపల్లి మున్సిపాలిటీకి బదిలీ చేశారు. నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సంపత్ రెడ్డి ఉద్యోగులు కలసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.