1 April, 2026 | 2:32 AM

రోడ్ల అభివృద్ధికి రూ. 247 కోట్లు నిధులు మంజూరు చేయండి

01-04-2026 12:03 AM

మంత్రి కోమటిరెడ్డిని కోరిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

మెదక్, మార్చి 31(విజయక్రాంతి): మెదక్ నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లో రోడ్ల పునరుద్ధరణ కోసం నిధులు మంజూరు చేయాలని మెదక్ ఎమ్మె ల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి విన్నవించారు. నియోజకవర్గ పరి ధిలోని గ్రామాల రోడ్లకు గాను 91 కిలోమీటర్ల మేరా 247 కోట్ల రూపాయలు మంజూ రు చేయాలని ప్రతిపాదనలు అందజేసినట్లు ఎమ్మెల్యే రోహిత్ రావ్ తెలిపారు.

పాపన్నపేట మండల కేంద్రం నుండి పెద్ద శంకరం పేట ఉత్లూరు వరకు, కొడపాక నుండి నా ర్సింగ్ వరకు రోడ్డు మరమ్మతుకు నిధుల మంజూరు, ముద్దాపూర్ కు వెళ్లే రోడ్డు మరమ్మతుకు, పట్టణంలో రోడ్డు నిర్మాణంకు, మండలం ఖాజాపూర్ మీదుగా మిరుదొడ్డి వరకు రోడ్డు మరమ్మతు, టీ మందాపూర్ నుండి ఖాజాపూర్ మీదుగా శంకరంపేట వరకు రోడ్డు మరమ్మతు కోసం నిధులు మంజూరు చేసి ప్రజలకు రవాణా సదుపాయం మెరుగుపరిచేలా చూడాలని ఆయ న మంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ తెలిపారు.