30-10-2025 12:23:11 AM
 
							ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కోరిన ఎంపీ అరవింద్
నిజామాబాద్, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి అయినా మల్లు భట్టి విక్రమార్కని, ఆయన కార్యాలయంలో నిజామా బాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఆయనను కలిసిన సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన మాధవ్ నగర్, అర్సపల్లి, అడవి మామిడిపల్లి ఆర్వోబీల కు సంబంధించి సుమారు 13.5 కోట్ల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని భట్టి విక్రమార్క ను ఆయన కోరారు.
అరవింద్ విన్నపం మేరకు సానుకూలంగా స్పందించిన బట్టి విక్రమార్క, పెండింగ్ బిల్లుల ను సత్వరమే విడుదలయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఎంపీ అరవింద్ భట్టి విక్రమార్క కు ధన్యవాదాలు తెలిపారు.