calender_icon.png 21 October, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్జాగా ఇసుక దందా

21-10-2025 06:58:32 PM

తరలుతున్న అక్రమ ఇసుక రవాణా..

పాలేరు వాగు నుండి ఆకేరు వాగు వరకు..

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో దర్జాగా అక్రమ ఇసుక రావణా దందా జరుగుతున్నది. మండలంలోని పలు వాగుల నుంచి కొన్ని రోజులుగా ఇసుక అక్రమ రవాణా ఇచ్చిన వేడుక సాగుతుంది. కొందరు ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరు చెప్పి ఇసుకను జిల్లాకు దాటేస్తున్నారు. మరికొందరు తమకు అనుకూలమైన ప్రాంతాలలో వాటిని నిల్వచేసి తర్వాత ఎక్కువ రేటుతో ఆ ఇసుకను విక్రయిస్తున్నారు. తానంచర్ల శివారు పాలేరు వాగు నుండి ప్రతిరోజు 20 నుంచి 40 ట్రాక్టర్ల వరకు అక్రమ ఇసుక రవాణా దందా జోరుగా సాగుతున్నది.

అధికారపక్ష నాయకుల అండదండలతో

ఈ దందా ఇంత జోరుగా సాగడానికి ఇసుక అగ్రమా రవాణా చేస్తున్న ట్రాక్టర్ యజమానులకు అధికారపక్ష నాయకుల అండ దండాలు ఉన్నాయని వారి అండదండలతోటి ఇసుక అక్రమ రవాణా దందా దర్జాగా కొనసాగుతుందని స్థానికుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు ట్రాక్టర్లు పట్టుకున్న సందర్భాల్లో కొందరు వ్యక్తులు రాజకీయ నాయకులతో నేరుగా అధికారులకు ఫోన్లు చేపిస్తుండడంతో వారిని వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. 

నామమాత్రంగా దాడులు

పత్రికల్లో వచ్చిన సమయంలో నామమాత్రంగా పోలీసులు అధికారులు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ అక్రమ దందాలో అధికారుల వాటా ఎంతనే పలు గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ ఇసుక అరికట్టాలని ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్సును కూడా ఏర్పాటు చేసింది ఒకటి రెండు రోజులు సెలవులు వస్తే చాలు అక్రమ ఇసుక ట్రాక్టర్లకు అదుపు లేకుండా పోతుంది ఫిర్యాదు చేసిన సమయంలో అధికారులు ఒక ట్రాక్టర్ కొట్టుకోవడం మిగతా ట్రాక్టర్లలను వదలడం పరిపాటిగా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.