calender_icon.png 27 October, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కప్పెట వాగులో ఇసుక దందా

27-10-2025 12:00:00 AM

- దర్జాగా తరలిస్తున్న.. పట్టింపే లేదు 

- ఇదేంటంటూ అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు

భూత్పూర్, అక్టోబర్ 26: మండల పరిధిలోని కపట వాగులో దర్జాగా ఇసుక రవాణా జరుగుతుంది. రాత్రి సమయంలో అయితే అడ్డు అదుపు లేకుండా ఇసుక అక్రమ ర వాణా తరలింపు జరుగుతుందని ప్రజలు చె బుతున్న మాట.

నియంత్రించాల్సిన అధికార యంత్రం అసలు పట్టించుకోవడం లేదని, ఇలా చేసుకుంటూ పోతే భూగర్భ జలా లు ఏమవుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అనుమతి లేకుండా ఇసుక తరలింపు ప్రక్రియను నిలిపివేయాలని అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్న మాట.