calender_icon.png 1 August, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరస్‌గుత్తి గురుకుల పాఠశాలలో పారిశుద్ధ్య పనులు

28-07-2025 12:00:00 AM

స్పందించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నాగల్గిద్ద, జూలై 27 : నాగల్ గిద్ద మండలం కరస్ గుత్తి గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారడంతో విద్యార్థులు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని విజయక్రాంతి దినపత్రికలో పేరుకే గురుకులం.. సమస్యలకు నిలయం అనే శీర్షికతో  ప్రచురితమైన కథనానికి నారాయణఖేఢ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పందించి పాఠశాలలో పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు.

మురుగుతో నిండిపోయిన డ్రైనేజీకి మరమ్మతు పనుల్లో భాగంగా  గుంతలు తీశారు. నీటి సమస్య కోసం బోరు మోటారు రిపేర్ చేయించి బిగించడం జరిగిందని, విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థులకు ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని భరోసా కల్పించారు.  గురుకులంలో సమస్య పరిష్కరించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది హర్షంవ్యక్తంచేశారు.