27-07-2025 04:19:27 PM
హైదరాబాద్: మహిళ భర్త కాకుండా మరో వ్యక్తి నుంచి వీర్యకణాలు సేకరించారని ఆరోపణలు వెలువడుతున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కు ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థకు సంబంధాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తూ వాటిని గుజరాత్, మధ్యప్రదేశ్ తరలిస్తున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసుపై పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ... రెజిమెంటల్ బజార్ లో ఉన్న ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ అనుమతులు లేకుండా కేంద్రాన్ని నడుపుతున్నట్లు గుర్తుంచామన్నారు. సంతానం కలగని దంపతులు సృష్టి ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ నమ్రతను కలిశారు.
దంపతులకు పలు పరీక్షలు నిర్వహించి ఐవీఎఫ్ సాధ్యం కాదని చెప్పిన నమ్రత సరోగసీ ద్వారా సంతానం పొందవచ్చని తెలిపారు. సరోగసీ కోసం రూ.30 లక్షలు ఖర్చవుతుందని, సరోగసీ కోసం విశాఖకు చెందిన దంపతులను ఒప్పించానని డా. నమ్రత ఒప్పుకున్నట్లు డీజీపీ తెలిపారు. సరోగసీ కోసం విశాఖ దంపతులు రూ.5 లక్షలు అడిగారని, దంపతుల నుంచి అండం, వీర్యం సేకరించి సరోగసీ చేస్తున్నామని చెప్పారు. కొన్నాళ్ల తర్వాత విశాఖ ఆసుపత్రిలో ఒక బాబును దంపతులకు చూపించారని, సరోగసీకి ఒకప్పుకున్న మహిళ అదనపు డబ్బులు అడుగుతున్నారని చెప్పి బాధితుల నుంచి డా.నమ్రత అదనపు డబ్బులు రాబట్టింది.
ఈ కేసులో డా.నమ్రత అసలు సరోగసీ చేయలేదని, విశాఖలోని ఒక గర్భిణీని చూపించి సరోగసీ మదర్ అని చూపించారని డీసీపీ రష్మి పెరుమాళ్ పేర్కొన్నారు. శిశువు వద్దనుకున్న ఒక మహిళకి రూ.90 వేలు చెల్లించి పుట్టగానే శిశువును తీసుకున్నారు. బిడ్డ కోసం కలగన దంపతులకు శిశువు అప్పగించారు. శిశువు విషయంలో దంపతులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సృష్టి ఆసుపత్రి నిర్వాహకులు చాలా నిబంధనలు ఉల్లంఘించారని, అసలు ఆ దవాఖానకు సరైన అనుమతులు లేవని డీసీపీ రష్మి తెలిపారు. సృష్టి ఆసుపత్రిపై చాలాచోట్ల ఫిర్యాదులు ఉన్నాయని, ఆసుపత్రిలో డాక్టర్, సిబ్బంది ఎవరూ సరైన నిపుణులు లేరని వారీ దర్యార్తులో తెలిందన్నారు. ఆసుపత్రి రిజిస్టేషన్ సర్టిఫికెట్స్ కు 2021లోనే గడువు తీరిందని, ఈ దవాఖానపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని డీజీపీ స్పష్టం చేశారు. సంతానం లేని దంపతులను ఎంచుకుని డా.నమ్రత మోసాలకు పాల్పడుతున్నారని, మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టేషన్ లేకుండానే అక్రమంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నారని ఆమె వివరించారు.