calender_icon.png 1 August, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్ ఆర్వోబీపై గడ్డర్ల బిగింపు

28-07-2025 12:40:27 AM

  1. కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరికతో పనులు వేగవంతం

చెన్నై నుంచి స్పెషల్ క్రేన్ తెప్పించి పూర్తి

పూర్తునకీలకఘట్టం

కరీంనగర్, జూలై27(విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సం జయ్ చొరవతో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న జమ్మికుంట ఉప్పల్ ఆర్వోబీ పనులకు మోక్షం కలిగింది. ఆర్వోబీ పనుల్లో కీలక ఘ ట్టమైన గడ్డర్ల బిగింపు పనులను రైల్వే శాఖ అధికారులు ఆదివారం పూర్తి చేశారు. ఉప్ప ల్ ఆర్వోబీ పనుల్లో గడ్డర్లు బిగింపు పనులే అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ గడ్డర్లు బిగించాలంటే ఆ రైల్వే లేన్ పై వెళ్లే రైళ్ల రాకపోకలను 3 నుండి 6 గంటల పాటు నిలిపివేయాల్సి ఉంది. దీంతోపాటు ఈ గడ్డర్లకు బిగింపుకు అవసరమైన క్రేన్ రాష్ట్రంలో అందుబాటులో లేదు.

చెన్నై నుండి తెప్పించాల్సి ఉంది. క్రేన్ రాక ఉప్పల్ ఆర్వోబీ పను లు గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇటీవల రైల్వే శాఖ అధికారులను పిలిపించుకుని ఉప్పల్ ఆర్వోబీ పనుల అంశంపై చర్చించారు. దశాబ్దకాలంగా ఉప్పల్ ఆర్వోబీ పనులు సాగడం లేదు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.

కాంట్రాక్టర్లు మారినా, సీబీఐ విచారణ జరిగినా... ఇంతవరకు ఆ పనులు ఎందుకు పూర్తి చేయడం లేదు? అసలు సమస్య ఏమిటి? అసెంబ్లీ ఎన్నికల తరువాత ఉప్పల్ ఆర్వోబీ పనులను పూర్తి చేస్తామని ఒకసారి, పార్లమెంట్ ఎన్నికల తరువాత పూర్తి చేసి ప్రారంభిస్తామని మరొకసారి రైల్వే శాఖ అధికారులు నాతో చెప్పారు. అదే విషయంపై ప్రజలకు హామీ ఇచ్చాను. అయినా ఇంతవరకు ఆ పనులే పూర్తి కాలే దు.

అసలు సమస్య ఏమిటి?  నెల రోజుల్లో ఉప్పల్ ఆర్వోబీ పనులను పూర్తి చేయకపోతే వచ్చే నెలలతో తానే దగ్గరుండి ఆర్వోబీని కూల్చివేయిస్తా. ఏం తమాషా చేస్తున్నారా? ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టింపు లేన ట్లు వ్యవహారిస్తారా?”అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై బండి సంజయ్ పలుమార్లు బహిరంగంగానే మా ట్లాడారు. దీనితో దిగొచ్చిన రైల్వే శాఖ అధికారులు ఉప్పల్ ఆర్వోబీ పనుల్లో గడ్డర్ల బిగింపు అత్యంత కీలకఘట్టమని చెప్పాను.

రైల్వేలను 3 గంటలపాటు నిలిపివేసి ఆ రైల్వే లేన్ పై గడ్డర్లను బిగించాల్సి ఉందన్నారు. అందుకు అవసరమైన క్రేన్ రాష్ట్రంలో అం దుబాటులో లేదని చెన్నై నుండి తెప్పించాల్సి ఉందని తెలిపారు. వెంటనే రైల్వే జీఎం, ఏజీఎంతో మాట్లాడిన కేంద్ర మంత్రి తక్షణమే చెన్నైయ్ నుండి క్రేన్ తెప్పించి రైళ్లను ఆపి యుద్ద ప్రాతిపదికన గడ్డర్లను బిగించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రైల్వే అధికారులు ఆదివారంఉదయం చెన్నై నుండి క్రేన్ తెప్పించారు. 

దాదాపు మూడున్నర గంటలపాటు జమ్మికుంట ఉప్పల్ వైపు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. చెన్నై నుండి తె ప్పించిన క్రేన్ తోపాటు అందుబాటులో ఉన్న మరో క్రేన్ సాయంతో గడ్డర్లను బిగిం పు పనులు పూర్తి సీజేశారు. ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణంలో కీలక ఘట్టం ముగిసినందున మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి ఆగస్టు నెలాఖరులోపు ఆర్వోబీని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రైల్వే శాఖ అధికారులుతెలిపారు.