calender_icon.png 13 September, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడ్కరీతో సంజయ్ భేటీ

05-07-2024 01:30:04 AM

తెలంగాణలో రోడ్ల విస్తరణపై చర్చ

కరీంనగర్, జూలై 4(విజయక్రాంతి): కేంద్ర రహదారులు, రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ గురువారం భేటీ అయ్యారు. తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పురోగతిలో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, కొత్త రహదారుల నిర్మాణ ప్రతిపాదనల అమలు అవకాశాలపై గడ్కరీతో చర్చించారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మండలాల్లో రోడ్ల విస్తరణకు సంబంధించి కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి(సీఆర్‌ఐఎఫ్) కింద నిధులు విడుదల చేయాలని బండి సంజయ్ కోరారు.