calender_icon.png 12 January, 2026 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికవర్ హాస్పిటల్‌లో స్టమక్ క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతం

12-01-2026 03:43:22 PM

హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ మెడికవర్ హాస్పిటల్‌లో మరోసారి వైద్యులు తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. మెడికవర్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డా.సునీల్ నాగుల మాట్లాడుతూ... కడుపులో తరచూ నొప్పి,ఆకలి లేకపోవడం, తెలియని బరువు తగ్గడం, రక్తహీనత, తిన్న వెంటనే నిండిపోయిన భావన వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.

కొన్ని వారాలుగా కడుపులో నొప్పి, జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న 55 సంవత్సరాల వయస్సు గల రోగికి ఎండోస్కోపీ, సీటీ స్కాన్ పరీక్షల్లో ప్రారంభ దశలోనే స్టమక్ క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించమని, సమయానికి వ్యాధిని నిర్ధారించడంతో, శస్త్రచికిత్స ద్వారానే పూర్తిస్థాయి చికిత్స సాధ్యమని వైద్యులు నిర్ణయించి, ఆంకాలజీ నిపుణుల సూచనల మేరకు టోటల్ గ్యాస్ట్రెక్టమీ విత్ డి2 లింఫ్ నోడ్ డిసెక్షన్ శస్త్రచికిత్సను అత్యంత జాగ్రత్తగా నిర్వహించామన్నారు. ఆపరేషన్ అనంతరం రోగి ఆశించినదానికంటే వేగంగా కోలుకుని, ఆరోగ్యంగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారన్నారు.

వరంగల్ ట్రైసిటీ ప్రాంతంలో ఇలాంటి అధునాతన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలు పరిమిత కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని,మెడికవర్ హాస్పిటల్‌లో స్టమక్, లివర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్లకు ఆధునిక సౌకర్యాలతో చికిత్సలు అందుతున్నాయని, వీటికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకూ క్యాన్సర్ వైద్యం అందించబడుతోందని తెలిపారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు అని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ వైద్య బృందం, మార్కెటింగ్ హెడ్ రాజేశ్వర్ రెడ్డి, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.